మీ ఫేస్ స్కాన్ తో ఆధార్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా?

ఆధార్ కార్డ్ ఇండియాలో ప్రతి ఒక్కరూ దగ్గర తప్పకుండా ఉండాల్సిన గుర్తింపు కార్డ్. ఇది చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వృద్దుల వరకు ప్రతి చిన్న విషయంలో దీని యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం దీనిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. కానీ కొన్ని సార్లు మన ఆ జాగ్రత్త వల్ల లేక మరే ఇతర కారణాల వల్ల మనం పొగుట్టుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI వెబ్ సైట్ లో ఈ-ఆధార్ రూపంలోనో, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డు రూపంలోనో పొందవచ్చు. దీనిని పొందటానికి చాలా రకాల పద్దతులున్నాయి. కానీ అన్నింటికంటే తేలికైన మీ ఫేస్ ని స్కాన్ చేసి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం. (చదవండి: ‘ఆధార్’ కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్)

దీని కోసం మనం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Get Aadhaar Card సెక్షన్‌లో డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదట మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత Face Authentication ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆథెంటికేషన్ ప్రాసెస్‌లో మీ ఫేస్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. UIDAI మీ ఫోటో క్లిక్ చేసిన తర్వాత OK పైన క్లిక్ చేయండి. మీ ఫోటో వెరిఫై అయిన తర్వాత ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. దీని కోసం మనం ఏటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *