రైతులకు తీపి కబురు.. అప్పటి నుండే రైతుబంధు డబ్బుల పంపిణీ

యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించి రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సీఎం చెప్పారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతుకి సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. రైతు బంధు కింద రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులు ఒక్కొక్క ఎకరానికి ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి 5,000 రూపాయల సహాయం పొందుతున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. రైతులు ఈ డబ్బును విత్తనాలు, పురుగుమందులు లేదా ఎరువులు కొనడానికి ఉపయోగించుకోనున్నారు. వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ) జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు.(చదవండి: రెండేళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *