డబ్బింగ్ స్టార్ట్ చేసిన ‘పుష్ప’

స్టార్ డైరెక్టర్ సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ ”పుష్ప”. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను అలరించింది. ఈ క్రమంలో ‘పుష్ప’ టీజర్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప ప్రీల్యూడ్ అంటూ హీరో ముఖం చూపించకుండా విడుదల చేసిన చిన్న వీడియోకే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఒకరోజు ముందే అంటే రేపు సాయంత్రం ‘పుష్పరాజ్’ ని ఇంట్రడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ‘పుష్ప’ డబ్బింగ్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ మొదలు పెట్టేసారు. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. చెప్పిన సమయానికి ఎలాగైనా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పుష్ప టీమ్ బాగా కష్టపడుతున్నట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *